Krishna Murali Profile Banner
Krishna Murali Profile
Krishna Murali

@WrittenByKrish

8,398
Followers
54
Following
1,453
Media
2,130
Statuses

యతో హస్త స్తతో దృష్టిః , యతో దృష్టి స్తతో మనః , యతో మనః స్తతో భావో , యతో భావః స్తతో రసః .....

films
Joined August 2012
Don't wanna be here? Send us removal request.
@WrittenByKrish
Krishna Murali
1 year
డిజిటల్ కెమెరాల యుగంలో కూడా 20 సెకండ్స్ ఒక నటుడి మీద కెమెరా పెట్టి ఎన్నో కట్స్ తో, ఇంకెన్నో టేక్స్ తో సన్నివేశాలు తీసే రోజులు ఇవి... ఫిల్మ్ కెమెరాతో రెండు నిముషాల లాంగ్ టేక్ ని హిందీ, తెలుగు కలిపి మాట్లాడి నటించిన #చిరంజీవి సర్. మన #విశ్వనాథ్ గారి సినిమా, థాంక్ యు @KChiruTweets
22
756
4K
@WrittenByKrish
Krishna Murali
8 days
సేనాపతి దృష్టిలో ఆనందం అంటే.... కూతురుగానే తను ఇంత బాగా చూసుకుంటుంది, తనే నా తల్లి అయితే ఇంకెంత బాగుంటుందో? చలి వేస్తున్నప్పుడు దగ్గరకి తీసుకునే భార్య, ముందు నన్ను నిద్ర పుచ్చి తరువాత నిద్రపోయే భార్య, అన్నిటికంటే పక్క మనిషి కోసం కార్చే రెండు కన్నీటి బొట్లు. ఇదే నిజమైన ఆనందం...
5
310
3K
@WrittenByKrish
Krishna Murali
14 days
ఇప్పుడంటే BOY BESTIE పేరుతో చాలా వేషాలు వేస్తున్నారు కానీ ఒకప్పుడు "గణేష్" అనే కుర్రాడు ఉండేవాడు.. బాగా చదువుకున్నాడు, సూటిగా మాట్లాడతాడు, అమ్మాయిలకి గౌరవం ఇవ్వడం తెలుసు, అవకాశం దొరికింది అని ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. గణేష్ లాంటి సినిమా, క్యారక్టర్ మళ్ళీ తెలుగులో రాలేదు.
16
278
2K
@WrittenByKrish
Krishna Murali
4 years
పాతికేళ్లు వచ్చినా ఎవ్వరూ నిన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు, ఒక అమ్మాయి నిన్ను నమ్ముతుంది, ప్రేమిస్తుంది, అడగకుండానే ముద్దు ఇస్తుంది...... అప్పుడు ఆ క్షణం ఆనందంతో ఏడ్చేస్తాం @chay_akkineni కుమ్మేశారు అంతే..... ఫస్ట్ కిస్ ప్రభావం ఇంతకంటే గొప్పగా చూపించలేరు #AyPilla
20
429
2K
@WrittenByKrish
Krishna Murali
19 days
#విశ్వనాథ్ గారు ఈ షాట్ తీస్తున్నప్పుడు పాద ముద్రలు ఆరిపోతూ ఉండేవి. రెండు టేక్స్ తీసాకా అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్, కాళ్ళకి నీరు కాకుండా కొబ్బరి నూనె రాస్తే పాద ముద్రలు ఆరిపోకుండా ఉంటాయని చెప్పాడు. ఆ తరువాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్ "సితార" "అన్వేషణ" లాంటి సినిమాలు తీశారు.
13
126
2K
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రతీ డైరెక్టర్ తన కోసం తన సంతృప్తి కోసం కసితో కొన్ని సినిమాలు చేస్తారు..... అలా @purijagan గారు ఆయన కోసం రాసుకున్న గొప్ప కథ ఇది. ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసినా నా దృష్టిలో కూడా ఆయన రాసుకున్న గొప్ప కథ ఇదే. "నా చెల్లెలిని ఎవడైనా టాయిలెట్ లోకి తీసుకెళ్తే చంపేస్తా" 🙏🙏🙏
21
188
1K
@WrittenByKrish
Krishna Murali
1 year
స్క్రిప్ట్ అంతా చదివితే కానీ #సీతారామశాస్త్రి గారు పాటని రాయరు...... వెంకీ నిద్రలో ఉండగా పాట టేకాఫ్ అవుతుంది "నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగా" అని రాసేసి, నందు అప్పటికే చాలాసార్లు ప్రేమిస్తున్నానని చెప్పినా వెంకీ ఏ సమాధానం చెప్పడు..అందుకే "అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథను తొందరగా".
13
219
1K
@WrittenByKrish
Krishna Murali
5 years
సాధారణంగా ఆయన హీరోలకి ఒక్క ధిమాక్ ఉంటేనే వాళ్ళ మాస్ ని తట్టుకోలేము అలాంటిది డబుల్ ధిమాక్ తో వస్తున్న #iSmartShankar మాస్ ని తట్టుకోవడం ఇంకా కష్టం. "చంటిగాడు","పండుగాడు", "బుజ్జిగాడు" సరసన చేరుతున్న @ramsayz గారికి, తన పూర్వ వైభవంలోకి రాబోతున్న @purijagan గారికి ప్రేమతో...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
71
1K
@WrittenByKrish
Krishna Murali
5 years
అప్పుడప్పుడూ ఇలాంటివి చెప్తూ ఉండండి లేకపోతే మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతాము ఏమో అని భయంగా ఉంటుంది. ఇంతేనా అనిపిస్తుంది కానీ అలా ఉండడం చాలా కష్టం. "మనకి ఇష్టమైన పనిలో మనం బ్రతకడమే సక్సెస్". ఈ ఒక్కమాట చాలు మళ్లీ బ్రతకడానికి @purijagan సర్ 😘😘😘
8
266
1K
@WrittenByKrish
Krishna Murali
4 years
ఒక మహానుభావుడు చెప్పినట్టు...... "ఇంట్లో అమ్మాయి ఉంటే సంగీతాన్ని నేర్పించాలి" "అబ్బాయి ఉంటే సంగీతాన్ని, అమ్మాయిని గౌరవించమని నేర్పించాలి"..... ( ఇంత అందమైన వాయిస్ ఏంటో??? ) తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఇంతలా చూపిస్తుందా???
12
231
987
@WrittenByKrish
Krishna Murali
5 years
ఆయనంటే ఒక రకమైన మోజు....... ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి "కమర్షియల్ సినిమా అంటే ఇలా తీయాలి" అని నేర్పించిన దర్శకుడు ఆయన. సెట్ లో నాకు తెలియకుండా చాలాసార్లు ఆయన్ని అనుకరించేవాడిని అంత పిచ్చి. సినిమా భీభత్సమైన హిట్ కావాలని కోరుకుంటూ ప్రేమతో @purijagan సర్.... #iSmartShankar
Tweet media one
Tweet media two
9
40
916
@WrittenByKrish
Krishna Murali
5 years
ఆయన గురించి ఏ ఉపమానంలో చెప్పినా తక్కువే...... డిజిటల్ టెక్నాలజీలో కూడా ఎక్కువ టేక్స్ తీసుకుని కట్ లేకుండా నటించడం కష్టం కానీ ఫిల్మ్ కెమేరాతో షూట్ చేసే రోజుల్లో ఒక్క కట్ కూడా లేకుండా ఇంత అద్భుతంగా ఆయన తప్ప ఎవ్వరూ చేయలేదు. (మెగాస్టార్ కూడా ఆయన పేరు ముందు చిన్నదే) #చిరంజీవి గారు 🙏
28
302
905
@WrittenByKrish
Krishna Murali
5 years
ఆ చివరి 20 నిముషాల "మత్తు" అప్పుడే దిగేలా లేదు..... "A" సర్టిఫికెట్ ఇచ్చినా సరే మీ పిల్లలని తీసుకుని వెళ్ళండి వాళ్ళు కూడా "NOT PERMANENT"అనేది తెలుసుకుంటారు. ప్రేమ ఎంత ముఖ్యమో కామం కూడా అంతే ముఖ్యం. చాలా సంతోషంగా ఉంది @purijagan సర్. ( నెక్స్ట్ ఇంతకంటే పెద్ద హిట్ తీయాలి )
8
63
829
@WrittenByKrish
Krishna Murali
2 years
Once upon a time there lived a GHOST @RGVzoomin
8
99
810
@WrittenByKrish
Krishna Murali
26 days
కోట్ల విలువ చేసే సెట్స్ వేసి, తీస్తున్న పాటలు కంటే ఇలాంటి మాంటెజ్ సాంగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ మాంటెజ్ చూస్తున్న ప్రతీసారి తెలియకుండానే సన్నగా నవ్వు వచ్చేస్తుంది..... "తరం మారినా స్వరం మారని ఈ ప్రేమ" వాహ్ #వేటూరి గారు ❤️💞
6
84
768
@WrittenByKrish
Krishna Murali
5 years
#భగవద్గీత లో #శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా "కష్టంలోనూ,సుఖంలోనూ, విజయం లోనూ, ఓటమి లోనూ ఒకే విధంగా ప్రవర్తించేవాడే "యోగి"అవుతాడు. 28 ఏళ్ల తరువాత కప్ గెలిచినప్పుడు "సచిన్"లాంటి మహానుభావుడు కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. "ధోని"మాత్రం నేను నా పని మాత్రమే చేసానని మౌనంగా ఉండిపోయారు.
16
199
696
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రేమించిన అమ్మాయి దూరంగా వెళ్లిందని "అర్జున్ పాల్వాయ్" సిగరెట్,మందు తాగేసి ఆ బాధని మర్చిపోవాలని ప్రయత్నించలేదు ఎందుకంటే?? గొప్ప ప్రేమని ఏదీ మర్చిపోయేలా చేయదు అని అతనికి తెలుసు. అందుకే "పుస్తకాలు చదివి మానసికంగా" "రోజూ నడిచి శారీరకంగా" ఇంకా బలంగా మారాడు. క్యారెక్టర్ అంటే ఇది.
12
224
686
@WrittenByKrish
Krishna Murali
4 years
ఏ చిరునామా "లేక"...... ఎ బదులు పొందని "లేఖ"..... మాములు "క"కి, వత్తు "ఖ"కి మధ్యలో "ప్రేమ ఉంది" "విరహం ఉంది" "బాధ ఉంది" " ఒంటరితనం ఉంది" "శూన్యం ఉంది" మొత్తంగా "ఒక మనిషి కథ ఉంది" #సీతారామశాస్త్రి గారు 🙌🙏🙌
Tweet media one
Tweet media two
4
91
720
@WrittenByKrish
Krishna Murali
5 years
గొప్ప యుద్ధాలన్నీ "నా" అనుకునే వాళ్ళతోనే...... త్రేతాయుగంలో "రాముడు" పడిన మానసిక సంఘర్షణ అయినా, ద్వాపరయుగంలో అన్నదమ్ముల మధ్య జరిగిన "కురుక్షేత్రం"అయినా, కలియుగంలో జరుగుతున్న గొడవలు అన్నీటిని కుదించి ఒక్క మాటలో చెప్పిన #త్రివిక్రమ్ గారి ముందు "EIFFEL TOWER" కూడా చిన్నబోయింది.
Tweet media one
7
134
687
@WrittenByKrish
Krishna Murali
26 days
పూరి సర్ చేసిన ఒక గొప్ప పని "నేనింతే సినిమా తీయడం"..... సినిమా అనే కాదు ఏ కెరీర్ లో అయినా సరే ఎంత కింద పడినా సరే సహనం, నమ్మకం, ఎక్కువసేపు బాధ పడకుండా ఉండడం, కలలో కూడా మనసు దాని మీదే ఉండాలని నేర్పించారు. అంత బాధలో కూడా వాళ్ళ అమ్మని ఓదార్చిన రవి అంటే నాకు చాలా ఇష్టం...
4
93
666
@WrittenByKrish
Krishna Murali
4 years
2020 నుండి ఇంకో "జానకమ్మ" గారు, "చిత్ర" గారు, "శ్రేయా ఘోషల్" గారు కలిపి వచ్చి పాడుతున్నట్టు అనిపిస్తుంది.......
18
154
619
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రేమించాలి అనుకుంటే "గౌతమ్ మీనన్" సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిని ప్రేమించాలి..... బాగా చదువుకుంటారు,ఇండిపెండెంట్ గా ఉంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు,అందంగా కూడా ఉంటారు,అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాలంలో చాలామంది అమ్మాయిలకి లేని "క్యారెక్టర్" ఈయన సినిమాల్లో హీరోయిన్ కి ఉంటుంది.
9
177
576
@WrittenByKrish
Krishna Murali
2 years
నిన్న రాత్రి మంచి కల రాలేదని ఈరోజు నిద్రమానుకుని ఉండలేం, పోనీ ఈరోజు గొప్ప కల వచ్చిందని మేల్కొకుండా అలాగే పడుకుని కూడా ఉండలేం..... అవి కలలు అంతే, వాటి గురించి ఎక్కువ ఆలోచించనట్టే కష్టం గురించి కూడా ఎక్కువ ఆలోచించకు. థాంక్స్ #సీతారామశాస్త్రి గారు
2
104
624
@WrittenByKrish
Krishna Murali
1 year
అంతవరకూ ప్రేక్షకుడికి మాత్రమే తెలుసు తాను అమాయకుడు అని, భార్యకి కూడా తెలియజెప్పాలి కానీ ఎలా?? ఒక చేత్తో తన బిడ్డని, ఇంకో చేత్తో తాళి కట్టిన భర్తని కడుపులో దాచుకుని ఇద్దరూ పిల్లలే అని చెప్పే సన్నివేశం. వెనుక సన్నగా జోలపాటలా వచ్చే సంగీతం G.O.A.T #విశ్వనాథ్ గారు
1
101
630
@WrittenByKrish
Krishna Murali
5 years
మెగాస్టార్, రెబల్ స్టార్, కలెక్షన్ కింగ్ లాంటి స్టార్స్ ఒకవైపు, ఒక పక్కా కమర్షియల్ డైరెక్టర్ మధ్య "రాజు లా కూర్చున్న సత్యానంద్ గారు". కథ మాత్రమే సినిమాకి హీరో, రచయిత మాత్రమే సినిమాకి రాజు. ( ఎంత ఖర్చు పెట్టినా, ఎంతమంది స్టార్స్ ఉన్నా "కథ, రచయిత లేకపోతే మొత్తం వృధా )
Tweet media one
3
39
583
@WrittenByKrish
Krishna Murali
15 days
వయస్సులో ఉన్న, అందమైన అమ్మాయి ఒ��టి మీద ఉండే వస్త్రాలకు ఒక రకమైన గర్వం ఉంటుంది, ఎందుకు?? అంత అందమైన శరీరాన్ని ఎవ్వరికీ కనిపించకుండా దాచేసి ఉంచుతుంది కాబట్టి.. "తనువును పెన వేసిన నీ చీరకెంత గర్వం" "యవ్వన గిరులను తడిమేననా" 🥵🥵 చరణం మొత్తాన్ని ఒక్క షాట్ లో తీసిన #రాఘవేంద్రరావు గారు
5
77
599
@WrittenByKrish
Krishna Murali
19 days
బార్ లో🍺, అందరూ మందు తాగుతుండగా అక్కడ శాస్త్రీయ సంగీతం వాడాలనే #విశ్వనాథ్ గారి ఆలోచనకి 🙏🥰 ఈ పాటని అవార్డ్స్ కి పంపిస్తే, అన్నమయ్య రాశారని జ్యూరి మెంబర్స్ తిరస్కరించారు. తరువాత #సీతారామశాస్త్రి గారు రాశారని తెలుసుకుని అప్పుడు నంది అవార్డు ఇచ్చారు. అందుకే అన్నమయ్య = సీతారాముడు
5
92
592
@WrittenByKrish
Krishna Murali
5 years
యుద్ధం మొదలయ్యే ముందు నిశ్శబ్దంలో నుండి వచ్చే సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా?? ఒక కుర్రాడు గ్యాంగ్స్టర్ గా మారే పరిణామంలో ఎలాంటి మ్యూజిక్ ఉండాలో తెలుసా?? @ThisIsDSP గారికి #సుకుమార్ గారంటే కొంచెం ఎక్కువ ప్రేమ అనుకుంటా.....
6
63
559
@WrittenByKrish
Krishna Murali
5 years
హీరోయిన్ పరిచయ సన్నివేశం అంటే..... తడిసిన బట్టలు, నడుము, చెమటతో ఉన్న రొమ్ములు లాంటివి చూపించకుండా "సాంప్రదాయంగా, అమ్మవారి నేపధ్య సంగీతంలో చూపించిన మనిషి కంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనుకునే మూర్ఖుల మధ్య ఉంటున్నాం". ( మిగతా దర్శకులుని తప్పు పట్టడం లేదు) అనేవాళ్ళని అంటున్నా....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
153
525
@WrittenByKrish
Krishna Murali
3 years
#DearMegha On the sets...... కొన్ని సినిమాలకి అసోసియేట్ అవ్వడం ఆనందాన్ని ఇస్తుంది, అలాంటిదే ఈ సినిమా. ప్రతీరోజూ సెట్లో గడిపిన ప్రతీ క్షణం మర్చిపోలేని జ్ఞాపకం. ఇంకా మా @akash_megha గారైతే 😍😍😍
Tweet media one
1
18
575
@WrittenByKrish
Krishna Murali
5 years
తప్పుగా అనుకోకండి @23_rahulr గారు..... ఇలాంటి ఒక్క సీన్ అయినా? ఇంత గొప్ప మ్యూజిక్ అయినా? ఇంత మంచి మాటలు అయినా? ఇంత మంచి కట్స్ అయినా? ఇంత మంచి సినిమాటోగ్రఫీ అయినా? వీటిలో ఏదైనా #Manmadhudu2 లో ఉంటుందా?అసలు క్రియేట్ చేయగలరా? ( ఆ సినిమా మీద ప్రేమతో చెప్పాను,మీమీద కోపంతో కాదు )
19
182
517
@WrittenByKrish
Krishna Murali
11 months
నిన్నంతా బాగాలేదు అందుకని రేపు కూడా అలాగే ఉంటుంది అని ఈరోజు కూడా బాధ పడడం ఎంత వరకూ కరెక్ట్?? ఎందుకంటే నిన్న రాత్రి ఒక కల వచ్చింది రోజంతా అదే తలుచుకుని ఈరోజు కూడా నిద్రపోకుండా ఉంటామా?? పోనీ మంచి కల వచ్చింది అలా అని చెప్పి నిద్రనుండి లేవకుండా ఉండగలమా?? థాంక్యూ #సీతారామశాస్త్రి గారు
4
105
563
@WrittenByKrish
Krishna Murali
5 years
నేను వెళ్తాను....... నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది...... ( ఈ సంవత్సరపు ఉత్తమ సంభాషణ ) పేజీలకు పేజీలు డైలాగ్స్ రాయకుండా సింపుల్ గా రెండు వాక్యాల్లో నేను చూసిన తెలుగు సినిమాలో గొప్ప బ్రేక్ అప్.
Tweet media one
Tweet media two
6
108
502
@WrittenByKrish
Krishna Murali
4 years
ఆయన లేకపోతే నేను మా ఊరు వచ్చేవాడిని కాదు...... అతని ఆస్తులు పోయినా పర్లేదు కానీ వీలైనంతమందికి సహాయం చేయడానికి వెనకాడడం లేదు. ఎంతమంది ఉంటారు ఈ కాలంలో @prakashraaj సర్ లా??? గొప్ప నటుడే కాదు గొప్ప మనిషి కూడా.
Tweet media one
9
55
516
@WrittenByKrish
Krishna Murali
15 days
"నిబద్ధత" అని తెలుగులో ఒక పదం ఉంది.. స్టార్ హీరోయిన్ అయినా కూడా ఒక కమెడియన్ తో డ్యూయెట్ సాంగ్ చేయడం, ఇలాంటి పాటలో కూడా "సరిగంగ స్నానాలు" అనే అర్థవంతమైన సాహిత్యం రాయడం, జాతీయ అవార్డులు తీసుకున్న #బాలసుబ్రమణ్యం గారు #చిత్రమ్మ గారు పాడడం. కేవలం డబ్బులు కోసమే చేశారంటే ఒప్పుకోలేము!!
10
64
535
@WrittenByKrish
Krishna Murali
17 days
కథలో ఉన్న ఆత్మని పట్టుకుని #సీతారామశాస్త్రి గారు రాసిన పాట..... చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయావ్ చాలా ఏడ్చాను, ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కలిసావ్ మళ్ళీ ఏడిపిస్తున్నావ్ కానీ ...... ఆ కన్నీళ్ళు కి, ఈ కన్నీళ్లకు మధ్యలో "ప్రేమ" ఉంది. అప్పుడు దుఃఖం, ఇప్పుడు సంతోషం🙏🥰
4
56
536
@WrittenByKrish
Krishna Murali
11 days
విడిపోయేది మళ్ళీ కలవడానికే !!! మనుషులు మాట్లాడుకోవడానికి భాష పుట్టింది కానీ ఒక స్థాయి దాటిపోయిన తరువాత ప్రతీ ఎమోషన్ ను మాటల్లో చెప్పలేం ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు అస్సలు మాటలు రావు.... సరిగ్గా అటువంటి సమయంలో సంగీతం మాత్రమే మన పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పగలదు.
1
89
526
@WrittenByKrish
Krishna Murali
1 year
సినిమాల్లో తప్ప బయట నటించడం తెలియని భోళా మనిషి..... ఎవరు సాయం అడిగినా కాదనకుండా చేసేస్తారు, 8 భాషల్లో సుదీర్ఘంగా మాట్లాడగలరు, ఎంత గొప్ప నటుడో అంతకంటే గొప్ప మానవతావాది. మట్టిని, మొక్కని ప్రేమించే మా @prakashraaj సర్ కి గౌరవంతో పుట్టినరోజు శుభాకాంక్షలు. #HappyBirthdayPrakashRaj
Tweet media one
8
30
511
@WrittenByKrish
Krishna Murali
23 days
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే గొప్ప ఫిల్మ్ మేకర్ ఉండేవారు.... ఆయన సినిమాల్లో పాటలు బాగుండేవి, అమ్మాయిని క్లోజ్ అప్స్ లో అందంగా చూపించేవారు, కొత్తవాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చేవారు, ఆయన షాట్ మేకింగ్, సీన్ కన్స్ట్రక్షన్ ఇప్పటి కొంతమంది దర్శకులకి కూడా చేత కాదు.
11
56
516
@WrittenByKrish
Krishna Murali
5 years
హీరోకి 100 కాస్ట్యూమ్స్ మార్చలేదు, అసలు హీరోయిన్ లేదు, అంత థ్రిల్లింగ్ లో కూడా హ్యూమర్ ని ఇచ్చారు, 36 రాత్రుళ్ళు లో షూట్ చేశారు, ఖైదీ మీద కూడా జాలి కలుగుతుంది, ఎలివేషన్ కోసం సీన్స్ రాయలేదు, సినిమా చూస్తున్నంతసేపు అసలు ఫోన్ వంక చూడవు #Khaidi భీభత్సమైన బ్లాక్ బస్టర్ @Karthi_Offl 🙏
Tweet media one
7
96
478
@WrittenByKrish
Krishna Murali
1 year
నేను ఎక్కువేం తాగలేదు..... నేనేమీ అడగలేదే!!! మనిషిని కదిలించే సన్నివేశాల్ని తీయడంలో ఏ దర్శకుడు ఆయన దరిదాపుల్లోకి రాలేరు. కృతజ్ఞతతో #విశ్వనాథ్ గారికి 😥
3
65
499
@WrittenByKrish
Krishna Murali
1 year
ఆయన సినిమాల్లో హీరోలకి ఏమున్నా లేకపోయినా బోలెడంత సంస్కారం ఉంటుంది...... ఎవ్వరినీ దేనినీ చులకనగా చేసి మాట్లాడరు, విలువలు ఉంటాయి, మనిషి ఎలా ఉండాలో!! మనిషి అంటే ఏంటో!! నేర్పించిన "కళాతపస్వి శ్రీ #విశ్వనాథ్ గారి సినిమాలు ఇంట్లో ఉన్న పిల్లలకి చూపించడం కూడా ఒక రకమైన ఆస్తి ఇచ్చినట్టే".
8
69
500
@WrittenByKrish
Krishna Murali
5 years
మనకి బాగా ఇష్టమైనవాళ్ళ గురించి మాటల్లో చెప్పలేం ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ మాటల్లో చెప్పినా అర్ధం కావు అలా నా జీవితంలో ఉన్న ఒక మనిషి @isudheerbabu గారు. నేను ఇలా ఉన్నా,ఎలా ఉన్నా, ఇంకెలా ఉన్నా అన్నీటికి మీరు వేసిన పునాదే సర్ 🙏 #HBDSudheerBabu
Tweet media one
2
23
449
@WrittenByKrish
Krishna Murali
1 year
అప్పుడే నటించడం నేర్చుకున్నవాళ్ళకి ఎంతో కసి, పట్టుదల ఉంటాయి. నేనేంటో నిరూపించుకోవాలని కసి ఉంటుంది. మరి 1100 సినిమాల్లో చేసిన "శ్రీ బ్రహ్మానందం గారికి ఎంత పట్టుదల తెలుసా?? మూడు పేజీల డైలాగ్ ఉందని మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నటించిన 67 ఏళ్ల విద్యార్థి" #Rangamarthanda
2
76
465
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రేమ సముద్రం..... జాలి వర్షం..... హృదయం ఆకాశం.... ముగ్గురు పిల్లలని దత్తత తీసుకుని "అమ్మ"గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న @SunnyLeone గారు....... కదిలే దేవత "అమ్మ", కరుణించే కోపం "అమ్మ", ఎనలేని జాలి గుణమే "అమ్మ"
Tweet media one
Tweet media two
4
73
439
@WrittenByKrish
Krishna Murali
24 days
సంధ్య హీరోయిన్ అయిపోయింది, కొన్ని రోజుల్లో "స్టార్" హీరోయిన్ కూడా అయిపోతుంది. ఉన్నన్ని రోజులు పరిస్థితుల వలన సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడేమో అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. అయినా తను బాగుంటే చాలు లే "నువ్వు దూరం అయ్యే మాటేంతో చేదైన, ఓ నింగి తారై నువ్వుండాలే పైన" @ramjowrites 💞🌹
2
42
474
@WrittenByKrish
Krishna Murali
4 years
మాస్ మసాలా సినిమా తీయడం ఒక ఆర్ట్...... అందులోనూ #పోకిరి లాంటి సినిమా తీయడం అసాధ్యం. అందుకే @purijagan సర్ కూడా మళ్లీ ఇలాంటి సినిమా తీయలేకపోయారు. మాస్ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉండాలో చెప్పడానికి ఈ సినిమా ఒక "TEXT BOOK". చివర్లో ట్విస్ట్ అంతలా పేలడానికి ఆయన రాసుకున్న సీన్స్ 🙌🙌
5
105
431
@WrittenByKrish
Krishna Murali
13 days
ఒక మామూలు వెదురు కర్ర.... ఋషులు కంటే ఎక్కువ తపస్సులు చేసిందో, పూర్వ జన్మలో పుణ్యం చేసుకుందో తెలీదు. తన ఒళ్ళంతా రంధ్రాలు(గాయాలు) చేసుకుని, బాధలో ఉన్నప్పుడు దగ్గరకి తీసుకుని, సంగీతాన్ని సృష్టించి "మురళి"(వేణువు) ని చేసావ్. వెదురు కర్రకు అంత చేసావ్, నేను మనిషిని, మరి నా సంగతేంటి??
5
52
459
@WrittenByKrish
Krishna Murali
1 year
ఇట్టి నీకన్న అర్హులు ఇంకెవ్వరయ్యా!!!! ఒళ్ళంతా గగుర్పాటు, జలదరింత, ఆనందంతో కన్నీళ్ళు తెప్పించే సన్నివేశాలు ఎన్నో ఎన్నెన్నో...... సినిమాలతో బోలెడంత జీవితాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటూ #విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు.
5
88
444
@WrittenByKrish
Krishna Murali
1 year
#రాజమౌళి గారు, #త్రివిక్రమ్ గారు, #సుకుమార్ గారు, #శేఖర్_కమ్ముల గారు..... వీళ్ళందరూ ఆయన దగ్గర అప్పట్లో AD గా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. #Rangamarthanda సినిమా ద్వారా ఆ అవకాశం నాకు దొరికినందుకు!!! ప్రకృతికి, @director_kv సర్ కి భాసుమిల్లి ప్రణామాలతో 🙏🙏🙏
Tweet media one
7
18
441
@WrittenByKrish
Krishna Murali
1 year
హీరో ఏమన్నారు??? కథ బాగుంది అన్నారు కానీ ఈ కథ ఆయన మీద తీస్తే ఆడదు అన్నారు. సరే సరే బాధ పడకులే!! బాధ పడొద్దు అంటే ఎలా?? బాధ ఉంటుంది. థాంక్ యు థాంక్ యు థాంక్ యు @purijagan సర్ బోలెడంత ఓదార్పుని ఇచ్చినందుకు.....
1
53
440
@WrittenByKrish
Krishna Murali
1 year
తెలుగు సినిమా ప్రజలు కొన్నిరోజుల్లో #రంగమార్తాండ అనే క్లాసిక్ ని చూడబోతున్నారు..... నిజమైన సినిమాకి అర్ధం "సన్నివేశాన్ని వీలైనంత దృశ్య రూపంలో చెప్పడం" అది ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారు. గురూజీ @director_kv గారి విశ్వరూపం మార్చ్ 22 న చూడబోతున్నారు.
Tweet media one
5
16
440
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రతీ ఒక్కరూ స్టార్స్ మీద, కాంబినేషన్ మీద, టేకింగ్ మీద దృష్టి పెడితే ఈయన మాత్రం స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టారు..... ఇంత పదునైన ఎడిటింగ్ బహుశా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చేయలేదు. కథని పక్కదారి పట్టించకుండా మోడరన్ క్లాసిక్ ని ఇచ్చిన @AdiviSesh గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
4
31
409
@WrittenByKrish
Krishna Murali
5 years
ఒక గొప్ప సినిమా అంటే #Jersey లా ఉంటుంది, సక్సెస్ కోసం కష్టపడే ఒక యోధుడి కథ. అందరూ ఓడిపోయినవాడు అంటుంటే గెలిచి చూపించే ఒక మనిషి కథ. ఈ సినిమా నీ జీవితాన్ని మార్చేసినా మార్చేస్తుంది. (ప్రతి సంవత్సరం ఒక గొప్ప సినిమా వస్తుంది, ఈ సంవత్సరం #Jersey ) @NameisNani దర్శకుడికి 🙏🙏🙏
Tweet media one
4
76
400
@WrittenByKrish
Krishna Murali
5 years
"దొంగ లంజాకొడుకులు లసలే మసలే ఈ ధూర్తలోకంలో" అని #శ్రీశ్రీ గారు చెప్పింది ఇలాంటివాళ్లే గురించే...... తప్పు వాడిది మాత్రమే కాదు మతం పిచ్చితో ఇలాంటివి సపోర్ట్ చేసేవాళ్ళది కూడా. అసలు ఎక్కడనుండి వచ్చాయో ఇవన్నీ?? భయం ఉన్నవాడే మతాన్ని పట్టుకుని ఉంటాడు లేనివాడు పని చేసుకుంటాడు.
49
138
395
@WrittenByKrish
Krishna Murali
1 month
ఒక్కో పదంలో రొమాన్స్ ని ఉచ్ఛస్థితిలో రాసేశారు @boselyricist గారు.... "పరువాలలో మేడలు, బెజవాడలు" అని రాస్తేనే ఏదో ఫీలింగ్ తో ఉంటాం అక్కడితో ఆగకుండా "గోదావరి ��నిలో లో దొరికే సంపద కంటే నన్ను సోదా చేస్తే ఇంకా ఎక్కువ సంపద లభిస్తుంది" అని రాసినందుకు 😘🔥🙏
7
52
422
@WrittenByKrish
Krishna Murali
5 years
తెలుగు సినిమాలో ఒక గొప్ప మాంటేజ్...... మా నాన్న చనిపోయాడు, కోట్ల ఆస్తి పోయింది, మా అన్నయ్య పిచ్చోడు అయిపోయాడు, మా అమ్మ ఏడుస్తూ ఉంది, కుటుంబం బాధ్యత అంతా నా మీద ఉంది, ఇంకా ఏం మిగిలిందని నువ్వు దోచుకోవడానికి??నువ్వు ఇలా బెదిరిస్తే నవ్వు వస్తుంది.. @alluarjun మీ కెరీర్ లో బెస్ట్ ...
6
118
390
@WrittenByKrish
Krishna Murali
22 days
చెట్టు నుండి పడిన ఆపిల్ న్యూటన్ కి జ్ఞానాన్ని ఇచ్చినట్టు, మురికి గుంటలో పడిన ఆపిల్ రంగా కి జ్ఞానంతో పాటుగా ఆకలి కూడా తీర్చింది. ఇంట్లో, స్కూల్ లో, కాలేజ్ లో బ్రతకడం కాదు అవన్నీ దాటుకుని బయటకి వచ్చి బ్రతకడమే నిజమైన జీవితం. బాలచందర్ సర్ మాత్రమే రాయగలరు, కమల హాసన్ మాత్రమే నటించగలరు
0
81
415
@WrittenByKrish
Krishna Murali
5 years
బాధ అనే ఎమోషన్ ఒకవేళ తన బాధని సంగీతంతో చెప్పాలి అనుకుంటే ఇలాగే ఉంటుంది...... ఇంత మంచి "మ్యాజిక్ డైరెక్టర్" ని ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నమస్కరిస్తూ 🙏 ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు @ThisIsDSP సర్ 🎶🎷🎸🎻
4
101
377
@WrittenByKrish
Krishna Murali
5 years
ఒకప్పుడు ఈవిడంటే ఇష్టం, ఇంకేదో ఉండేది...... ఇప్పుడు మాత్రం గౌరవం.... అప్పటికంటే ఇప్పుడే అందంగా కనిపిస్తున్నారు బహుశా "అమ్మ"లా మారడం వలన అనుకుంటా?! 21 శతాబ్దంలో ఏ స్త్రీ అందుకోలేని స్థాయిలో ఉన్నారు @SunnyLeone గారు 🙏
Tweet media one
6
37
358
@WrittenByKrish
Krishna Murali
10 days
ఆలస్యమై నీ నిశ్చితార్థానికి అతిథిని అయ్యాను.... ప్రతీ డైలాగ్ లెక్కేసి మరీ రాసినట్టు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. 1) సాహసం పేరుతో లేచిపోవడం, 2) పిరికితనం తో చచ్చిపోవడం, 2) రాజీ పడిపోయి ఎవరి దారిన వాళ్ళు విడిపోవడం. "రమణ గోగుల గారికి మొదటి సినిమా అంటే నమ్మలేం" అంత అద్భుతంగా చేశారు.
3
74
405
@WrittenByKrish
Krishna Murali
3 years
గౌరవనీయులైన @megopichand గారు..... అసలు ఇంతవరకూ ఇలాంటి స్క్రిప్ట్ రాయకుండా ఎందుకు ఉండిపోయారు?? మీలోని మేకర్ ని ఈ సినిమాతో చూసాను. చాలా చాలా బాగా తీశారు, ప్రతీది ఇలాగే రాయండి, ప్రతీ సినిమాకి @dop_gkvishnu గారిని చేయమని చెప్పండి. ప్రతీ సీన్ బాగుంది, ప్రతీ షాట్ బాగుంది. థాంక్యూ
6
41
383
@WrittenByKrish
Krishna Murali
5 years
ఆడపిల్లని ఏదైనా అనేముందు ఈ ఒక్కమాట అందరం గుర్తుంచుకోవాలి..... ప్రకృతి,స్త్రీ ఇద్దరూ ఒక్కటే అని చాలా బలంగా చెప్పారు. వాళ్ళు తిట్టినా, చివరకి కొట్టినా భరించేద్దాం. వాళ్ళని మోసం చేయడం, ఏడిపించడం, వాళ్ళ మీద గెలవాలి అనుకోవడం మూర్ఖత్వం #త్రివిక్రమ్ #AlaVaikunthapurramulooTrailer
8
79
360
@WrittenByKrish
Krishna Murali
5 years
చిన్న చిన్న వాటికే బాధపడి,ఓదార్చడానికి ఎవ్వరూ లేరని ఏడ్చే మనుషుల మధ్య "రవి" ప్రత్యేకం. కనీ పెంచిన అమ్మ చనిపోయి, ప్రేమించిన సినిమా ఆగిపోతే తనని ఓదార్చడానికి వచ్చిన అమ్మాయిని ఓదార్చే గొప్ప స్ట్రాంగ్ పర్సనాలిటీ అతనిది. అతని హీరోలు ఇష్టం,అవి రాసిన @purijagan గారంటే గౌరవం
5
85
355
@WrittenByKrish
Krishna Murali
5 years
చాలాసార్లు మగవాళ్ల చూపులు, చేతులు తెలియకుండానే వాటికి ఆకర్షించబడతాయి..... పుట్టిన వెంటనే మొదటిసారి తన ఆకలి తీర్చిన "స్తనాలు" ని ఆరాధనతో చూడడం మగవాడికి చిన్నప్పటినుండి మొదలవుతుంది అని #ఓషో చెప్తారు. ( పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకూ నీ "ఆకలి" తీర్చేది #స్త్రీ మాత్రమే )
Tweet media one
Tweet media two
4
95
358
@WrittenByKrish
Krishna Murali
11 months
ఒక్క చరణంలో సినిమా కథని చెప్పిన మనసు కవి #ఆత్రేయ గారు.... ఒక బంధువు వచ్చాడు, తానొంటరినన్నాడు, ఆ బంధం వేసాడు సంబంధం చేసాడు, ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది, ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చోడయ్యాడు పిల్లాడేమో పిచ్చోడయ్యాడు...... ( ఇలా రాయాలంటే ఎంత తెలివి ఉండాలి) 🙏
8
82
386
@WrittenByKrish
Krishna Murali
5 years
"బిజినెస్ మ్యాన్" సినిమా ఎంత ఇష్టం అంటే?? మళ్లీ @purijagan గారిని ఎవరో ఒకరు మోసం చేస్తే ఆ కసితో అయినా ఇలాంటి సినిమా తీస్తారు కదా అనేంత స్వార్థంతో కూడిన ఇష్టం. "సూర్య" ఒక్కో డైలాగ్ చెప్తుంటే "వైల్డ్ హార్స్" గుర్తొస్తుంది, అది ఎవ్వడికీ లొంగదు ఎంత టార్చర్ చేసినా ఎన్ని బాధలు వచ్చినా.
3
67
362
@WrittenByKrish
Krishna Murali
5 years
సరస్వతీ పుత్రుడుగా పుట్టి సరస్వతి పుత్రుడు లాగే వెళ్ళిపోయిన #జంధ్యాల గారు..... మనిషిని కొట్టకుండా, బూతులు లేకుండా, అందంగా అమ్మానాన్నలతో కలిసి చూసే స్వచ్చమైన నవ్వుని ఆయన తప్ప తెలుగుకి ఇంకెవ్వరూ ఇవ్వలేకపోయారు. ( ఆయన చనిపోయిన రోజు కూడా అయన సినిమాలు చూసి నవ్వుతున్నాం )
3
94
361
@WrittenByKrish
Krishna Murali
4 years
ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కంటే గొప్ప సినిమా, 1000సార్లు చూసినా మళ్లీ చూడలనిపించే సినిమా, ప్రతీ క్రాఫ్ట్ ఎలా ఉండాలో నేర్పించిన సినిమా, జీవితగమనాన్ని మార్చిన సినిమా, ప్రతీ సీన్ ప్రేమ తప్ప ఇంకేం ఉండదు #DecadeOfEverGreenClassicYMC #ఏమాయచేసావే మోడరన్ క్లాసిక్.....
3
123
353
@WrittenByKrish
Krishna Murali
5 years
కొన్నిసార్లు బ్రేక్ అప్ కూడా చూడడానికి బాగుంటుంది..... "విజయ్ కృష్ణ" చాలా అలసిపోయాడు ఎంతలా అంటే?? ప్రతీ దానికి సమాధానం చెప్పలేక ఎలాంటి భావోద్వేగం లేకుండా నిర్జీవమైన ముఖంతో నిస్సత్తువతో సూటిగా పద్దతిగా. ( అమ్మాయిని ప్రేమ కోసం ప్రేమిస్తే వాళ్లేమో సెక్యురిటి కోసం ప్రేమిస్తారు )
7
94
342
@WrittenByKrish
Krishna Murali
1 year
మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము...... చాలా సంవత్సరాలు తరువాత విమల, శ్రీను కలుస్తారు. ప్రేమో, ఆకర్షణో తెలుసుకునేలోపు విడిపోయి ఇలా అనుకోకుండా చూసేసరికి "అద్దంలో మొహం చూసుకుని అందంగా కనబడాలనే తాపత్రయాన్ని ఏ అమ్మాయి తప్పించుకోలేదు".
2
46
374
@WrittenByKrish
Krishna Murali
7 days
ప్రియమైన #జంధ్యాల గారు.... "రోట్లో వేసి రబ్బుతాను గ్రైండర్ వెధవ" అని ఎలా రాశారు మహాప్రభో!!! ఎన్ని నెలలు అయిందో ఇంత మనస్ఫూర్తిగా నవ్వుకుని, ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినట్టే అనిపిస్తుంది. కడుపులో నొప్పి వచ్చేంతగా నవ్వించినందుకు థాంక్స్ సర్ 🤣🤗🙏
15
145
1K
@WrittenByKrish
Krishna Murali
1 year
కలిసుందాం....కలిసే ఉందాం.... కాకితో కలకాలం గుర్తుండిపోయే సినిమాని ప్రపంచానికి ఇచ్చావు. నీ బలం చుట్టూ ఉన్న మంది కాదు, నీ అసలైన #Balagam ఎప్పటికీ నీ కుటుంబమే. బావని గౌరవించాలి, తోబుట్టువుని ప్రేమించాలి, పెద్దవాళ్లు బ్రతికుండగానే వాళ్ల మనసుని తెలుసుకోవాలి. థాంక్ యు @VenuYeldandi9
Tweet media one
1
31
367
@WrittenByKrish
Krishna Murali
1 year
గొప్ప సినిమా అంటే ఎప్పటికీ భావోద్వేగాలతో నిండి ఉండడమే...... సినిమా చూస్తున్నంతసేపు తెలియకుండానే చాలాసార్లు కళ్ళు చెమర్చుతాయి. జ్ఞానం, హృదయం ఉంటే ఏమైనా సాధించవచ్చని చెప్పిన "పల్లవి రవీంద్రన్". పడిపోయింది అనుకున్న తన కూతురు గాల్లో ఎగరడం చూసి అబ్బురపడిన తండ్రి వైడ్ షాట్ #Uyare
1
45
359
@WrittenByKrish
Krishna Murali
4 years
ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు అలా అని ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలని లేదు ఆ అమ్మాయికి వేరే అబ్బాయి మీద, ఆ అబ్బాయికి వేరే అమ్మాయి మీద మళ్లీ ప్రేమ కలగవచ్చు. ఒకసారి వచ్చిన ప్రేమ జీవితాంతం ఉండిపోతుందనే భ్రమలో నుండి మనుషులు బయటకి రావాలి #చలం (ఇంత తెలివైనవాడిని సమాజం ఒప్పుకోలేదు )
Tweet media one
6
63
356
@WrittenByKrish
Krishna Murali
1 year
ఆయన రాసిన సాహిత్యానికి తగ్గట్టుగా షాట్స్ ని కంపోజ్ చేసుకునేవారు దర్శకులు..... "తీరా నువ్వు కను తెరిచాకా, తీరం కనబడదే ఇంకా" అనే మాటకి నడి సముద్రంలో ఒడ్డు కనిపించకుండా ఏకాకిలా షాట్ ని తీశారు. #సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏
3
50
358
@WrittenByKrish
Krishna Murali
1 year
లోక నాయకుడు "కమల్ హాసన్" సర్ కంటే గొప్ప కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత భారతదేశంలో ఇంకెవరూ లేరు...... రెండున్నర గంటల సినిమా కథని ఒక్క వాక్యంలో చిన్న పిల్లాడితో చెప్పించారు. "ఇది ఈ ఊరు కుక్క, మన ఊరు వస్తే బ్రతకలేదు". ( సినిమా కథ కూడా ఇదే) @ikamalhaasan గారు భారతదేశపు ఆస్తి.....
4
51
354
@WrittenByKrish
Krishna Murali
1 year
స్క్రీన్ ప్లే గురించి #యండమూరి గారు చెప్పిన మాట.. ఒక క్యారక్టర్ ని పరిచయం చేసేటప్పుడు ఊరికే మాటలతో చెప్పడం కాకుండా, తన ప్రవర్తన ఎలా ఉంటుందో? ఆ క్యారెక్టర్ లక్ష్యం ఏంటో? దేనికోసం ఆరాటపడుతున్నాడో లాంటి విషయాలను చెప్పాలని. అంజాద్ భాయ్ లాంటి క్యారక్టర్ లు చాలా అరుదు @prakashraaj సర్
8
37
341
@WrittenByKrish
Krishna Murali
5 years
స్ట్రింగ్స్ తో #మణిశర్మ గారు చేసిన మ్యాజిక్..... "వదలమంటే ఏమిటర్థం వదిలిపొమ్మనా??" "మగువ మనసు తెలిసినా మగ జాతికి" లాంటి సాహిత్యం, ప్రతీ క్రాఫ్ట్ పరిపూర్ణమైన output ఇచ్చి తెలుగు సినిమాకి ఒక ఒక గొప్ప పాటని ఇచ్చారు.
2
64
323
@WrittenByKrish
Krishna Murali
5 years
"సౌందర్య" గారు, "జ్యోతిక" గారు బాగా చేసారు కానీ "శోభన" గారు అద్భుతంగా చేసారు...... వీడియో మొత్తం BGM లేకుండా చూసినా సరే ఆవిడ కళ్ళతో చూపించే ఎక్స్ప్రెషన్స్ కి భయం వస్తుంది. ( 1993 లో ఇలాంటి కాన్సెప్ట్ తో కథ రాయడం 🙏🙏🙏 )
12
66
322
@WrittenByKrish
Krishna Murali
4 years
"తనికెళ్ళ భరణి" గారు #పరికిణీ అని ఒక గొప్ప పుస్తకం రాసారు.. ఈ భూగోళం మొత్తం మనిషి అబ్బ సొమ్మా?? పిల్లాడికి జ్వరమొస్తే కోడిపుంజుకి చావా?? ఊళ్ళోకి కరువు వస్తే మేకల మెడ నరకలా?? ఈ భూమి మీద పండు పుట్టింది పిట్ట కోసం కాదా?? పండు పిట్టా రెండు నీకేనా?? ( మహానుభావుడుకి "పద్మశ్రీ" రావాలి )
Tweet media one
6
36
335
@WrittenByKrish
Krishna Murali
3 years
కన్నీరు..... కష్టం వచ్చినప్పుడు కాదు, వచ్చిన కష్టం పోయాక ఆనందంతో రావాలి అని నమ్ముతాను నేను. అవమానాలు, ఎదురుదెబ్బలు అన్నీ ఈ గెలుపుతో పోవాలని, పోతాయని బలంగా నమ్ముతున్నాను. ( ఫైనల్ డ్రాఫ్ట్ )
Tweet media one
41
30
340
@WrittenByKrish
Krishna Murali
5 years
అప్పుడప్పుడే "సినిమాటోగ్రఫీ" గురించి తెలుస్తున్న క్షణాలు. టీవీలో వచ్చినప్పుడు ఎందుకు ఇది మిగతా వాటికంటే బాగుందని అడిగితే "అది సినిమాటోగ్రఫర్ చేసిన మాయాజాలం అని" చెప్పాడు. అప్పుడు వస్తున్న చాలా సినిమాలకి ఈ సినిమాకి తేడా "సినిమాటోగ్రఫీ".భారతదేశపు ఉత్తమ సినిమాటోగ్రఫర్ @pcsreeram
2
65
332
@WrittenByKrish
Krishna Murali
1 year
ఒకరోజు "సీతారామశాస్త్రి" గారి దగ్గరకి ఒక అమ్మాయి వచ్చి...... మేము కూడా మగాళ్లతో సమానం అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలని అడిగింది, అప్పుడు ఆయన "ఇప్పుడు మీరున్న స్థానం కంటే పది మెట్లు కిందికి దిగి వస్తే మగాళ్లతో సమానం" అవుతారని చెప్పారు. #HappyWomensDay
Tweet media one
1
41
335
@WrittenByKrish
Krishna Murali
1 year
బస్సులు తగలబెడతాం, రైళ్లు పడగొడతాం, రాజయకీయ నాయుకుడుకి జేజేలు కొడతాం, బయటకి వచ్చిన స్త్రీని రేప్ చేస్తాం...... ఇదిరా నీ దేశం, ఇదిరా నీ స్వర్గం, ఇదిరా నీ పవిత్రమైన భారతదేశం. #విశ్వనాథ్ గారు సమాజాన్ని నిలదీసిన #జననీజన్మభూమి మిగతా క్లాసిక్స్ కంటే తక్కువేమీ కాదు.
3
103
332
@WrittenByKrish
Krishna Murali
11 days
మంచి భవంతి కట్టిన తరువాత ఇంజనీర్, మంచి సినిమా తీసాక దర్శకుడు, మంచి పెయింట్ వేసాక ఒక చిత్రకారుడు ఎలా మురిసిపోతారో అలాగే.... "పూవులతో శరీరాన్ని, మెరవడానికి వెన్నెలని, తేనెతో ప్రాణాన్ని పోసిన మల్లీశ్వరి ను చూసుకుని బ్రహ్మ కూడా అంతే ఆనందంగా మురిసిపోతాడు". మా #సీతారామశాస్త్రి గారు🥰
0
40
344
@WrittenByKrish
Krishna Murali
5 years
చాలాసార్లు ఏమీ తెలియని వాడితో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి దూరంగా ఉందాం అనుకునే లోపు ఒక "ఫోన్ కాల్" వస్తుంది. అంతవరకూ ఉన్న కోపం పోయి మాములుగా అయిపోతాం. చివరలో "అమ్మని అడిగానని చెప్పండి" అనేది #త్రివిక్రమ్ గారి "కలానికి ఉన్న భాద్యత"ని గుర్తుచేస్తుంది.
2
106
307
@WrittenByKrish
Krishna Murali
4 years
నా భర్తకి శరీరాన్ని నీకు మనసుని ఇస్తానని చెప్పిన ఆడదాన్ని నమ్మకు, నా భార్యతో ఉంటూ నిన్ను ప్రేమిస్తాను అని చెప్పిన మగవాణ్ణి అస్సలు నమ్మకు #యండమూరి
Tweet media one
5
39
327
@WrittenByKrish
Krishna Murali
1 year
హృదయాన్ని తట్టి లేపే సినిమాలు తీసిన #కృష్ణవంశీ గారంటే ప్రేక్షకులతో పాటుగా దర్శకులకి గౌరవమే..... ఆ తరానికే కాదు ఇప్పటివాళ్ళకి కూడా తన దర్శకత్వ ప్రతిభ ఏంటో, భావోద్వేగాలని ఎలా కాప్చర్ చేయాలో చూపించడానికి #రంగమార్తాండ తో వస్తున్న గురూజీ @director_kv గారికి ప్రేమతో.....
1
20
319
@WrittenByKrish
Krishna Murali
1 year
కొడుకు చెడిపోతే తండ్రి రెండు దెబ్బలు వేసి దారిలోకి తీసుకుని వస్తాడు కానీ!!!! తండ్రి తన బాధ్యతల్ని విస్మరించి, సరైన దారిలో లేనప్పుడు ఆ కొడుకు ఏం చేసి మార్చగలడు?? ఇద్దరికీ బంధువైన సంగీతంతో తండ్రిని మార్చేసిన కొడుకు. ఎనిమిది నంది అవార్డ్స్ ని గెలుచుకున్న శ్రీ #విశ్వనాథ్ గారి సినిమా
4
42
324
@WrittenByKrish
Krishna Murali
1 year
మనుషులకు కష్టాలు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతగా ఉంటాయని సూర్యానికి మొదటిసారి తెలిసిన క్షణాలు..... ఊరి మొత్తాన్ని మార్చాలని సూర్య నిర్ణయించుకున్న సమయాన, 5 సెకండ్స్ ఆయన క్లోజ్ అప్ లో నుండి #ఇళయరాజా గారు సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లిన సన్నివేశం. శ్రీ #బాలచందర్ గారి సినిమా
1
46
314
@WrittenByKrish
Krishna Murali
1 year
కృష్ణవంశీ గారి దర్శకత్వ విభాగంలో...... సెట్స్ లో ఎంత సహనం ఉండాలో, సన్నివేశం కోసం ఎంతగా ఆలోచించాలో, నటీనటులని ఎంత కంఫర్ట్ లో ఉంచాలో, హీరోయిన్స్ ని అందంగా చూపించడానికి ఎంత కష్టపడాలో, వీటితో పాటు ఇంకొంచెం ఎక్కువ సంస్కారాన్ని నేర్పినందుకు కృతజ్ఞతతో @director_kv 🙏🙏🙏 #Rangamarthanda
Tweet media one
Tweet media two
10
18
316
@WrittenByKrish
Krishna Murali
5 years
ప్రతీ స్త్రీ అందంగా ఉంటుంది కానీ పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీ అద్భుతంగా ఉంటుంది.... యాదృచ్చికంగా వాళ్ళందరూ గొప్ప హీరోయిన్స్ కూడా అయ్యారు. #స్త్రీ 🥰🥰🥰
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
35
296
@WrittenByKrish
Krishna Murali
5 years
ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడ్చినా పోలేదు, చివరకి మా ఊరు వదిలేసి వచ్చినా పోలేదు...... అమ్మాయిని కలిసిన తరువాత మొదటిసారి నవ్వాను ( అప్పటి #చలం నుండి ఇప్పటి #త్రివిక్రమ్ వరకూ అందరూ చెప్పింది ఒక్కటే "నిన్ను సేద తీర్చేది,నవ్వించేది, ఓదార్చేది స్త్రీ మాత్రమే )
Tweet media one
2
67
303