ChennuriSitaRambabu Profile Banner
ChennuriSitaRambabu Profile
ChennuriSitaRambabu

@ChennuriSita

9,085
Followers
1,438
Following
5,862
Media
18,479
Statuses

Live the moment...ఈ క్షణాన్ని చేజారనివ్వకు... రేపు కాదు వర్తమానమే నిజం... #Literature #Cinema #Sports #Politics Lover of Coffee &Tea

Hyderabad, India
Joined September 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@ChennuriSita
ChennuriSitaRambabu
10 months
తను నమ్మిన రాముడికే అంకితమై కుటుంబం కంటే దైవసేవే గొప్పదన్న రామశాస్త్రిని రాముడు కరుణించాడా! కెరీర్ మోజులో కుటుంబాన్ని అన్నను వదులుకున్న తమ్ముడిలో కనువిప్పు కలిగిందా..! వినండి "నిధి చాల సుఖమా" కథలో..2016 దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ..
0
4
42
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
"హీరో కృష్ణ జ్ఞాపకం" (వాట్సప్ ఫార్వర్డ్)
Tweet media one
13
665
3K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఎంత వయ్యారంగా గాలిలో తేలింది amazing 👏👏👏
26
363
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవటం కోసం తన పదెకరాల భూమిని దానం చేసిన గొప్ప హృదయం నటులు ప్రభాకరరెడ్డి గారిది.హీరోలు తప్ప ఇతరులను గుర్తుంచుకోని వాళ్ళం మనం కాబట్టి ఎక్కువ మందికి తెలీదు వారిదో గమ్మత్తైన ఉచ్చారణ. ఇవాళ వారి జయంతి.విలనీ ఒక వెరైటీ జయప్రదా ఆర్ట్స్ వారిదే అనుకుంటాను.
Tweet media one
27
365
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఎవరు చేశారో కాని కష్టం తెలుస్తుంది. ఆ అజ్ఞాత ఎడిటర్ కు నమస్సులు🙏🙏🙏
26
414
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కామెడీని చాలా సున్నితంగా అభినయించి నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం..వారిని చిన్న చూపుచూసి లాక్కెళ్ళి పోయింది కానీ నటించిన ప్రతి పాత్రలోను ఒక గుర్తుండిపోయే moment ఉండేది. ఇవాళ వారి జన్మదినం
Tweet media one
24
237
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
Reporting to భీమ్లానాయక్
Tweet media one
14
171
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
7 months
మళయాళం మూవీ Anweshippin Kandethum నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.. చూడండి.. హీరో ఇన్స్పెక్టర్ గా మనవాళ్ళు తీసే రొడ్డకొట్టుడు సినిమాలకు, మళయాళం లో వచ్చే సినిమాలకు తేడా తెలుస్తుంది.దర్శకుడు డార్విన్ కి ఇది తొలి చిత్రం కావటం విశేషం.. కథను ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఫాలో అవుతారో..
Tweet media one
119
160
2K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్.. ఎందుకోగానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు.వస్తే చూడరు.అదే తమిళో, మళయాళమో అయితే ఎత్తేసేవాళ్ళం!
Tweet media one
37
260
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఇద్దరూ నవ్వుల రారాజులే ఒకరిది మూకీ..ఒకరిది టాకీ.. ఇద్దరూ జీవితపు విషాదాలకు నవ్వుల టాకాలేసి టాటాచెప్పి వెళ్ళిపోయారు ఇద్దరూ ఏప్రిల్ 16న జన్మించారు వేర్వేరు కాలాల్లో.. అందరూ ఇష్టపడే ఛాప్లిన్ ఎమ్మెస్ నారాయణలకు నవ్వుల శుభాకాంక్షలు 😊😊
Tweet media one
Tweet media two
3
123
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఇవాళ్టితో 'అరవై' పూర్తి.. సీనియర్ సిటిజన్ హోదా వచ్చేసినట్టే !
Tweet media one
160
14
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
4 months
ప్యాకేజీ స్టారని ట్రోల్ చేశారు.ఇంకా అనేక విధాలుగా బురద జల్లారు.. పోటీ చేసిన 21స్థానాలు గెలవడమే కాదు కష్టకాలంలో @ncbn కూ అండగా నిలబడి కూటమి నుంచి ఏర్పాటు చేసి విజయపథంలో నడిపించిన "పవన్ కళ్యాణ్" నిజమైన హీరో
21
248
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
తరాలు మారినా బ్లూసీ చాయ్ టేస్ట్ మారదు #BlueSeaCafe
Tweet media one
Tweet media two
59
87
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
మనిషీ-మట్టీ-పశువు కలయిక తొంగిచూసె ఆకాశం తొలకరి చినుకై
Tweet media one
3
45
1K
@ChennuriSita
ChennuriSitaRambabu
10 months
పుస్తకం ఎందుకు చదవాలి? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచన వినండి @Trivikram_Fans @Trivikram_FC
7
269
902
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఆఫీసులో చిట్ట చివరిరోజు ఇప్పుడు జ్ఞాపకమై!
Tweet media one
24
17
872
@ChennuriSita
ChennuriSitaRambabu
11 months
మా వైవాహిక బంధం ముఫ్పై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ ముప్ఫై ఐదవ వసంతంలో అడుగుపెట్టింది 💖💖
Tweet media one
179
13
896
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
"బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు నటించు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనపడు" (యండమూరి నిశ్శబ్ద విస్ఫోటనం నుంచి)
4
108
803
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఈరోజున ముప్ఫై మూడులోకి ప్రవేశిస్తోంది మా వివాహబంధం పెళ్ళి కుటుంబాన్ని ,ధైర్యాన్ని,ఆసరాని ఎన్నింటిని ఇస్తుంది... ఒడుదుడుకులను దాటే వారధి కూడా...
Tweet media one
110
18
791
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
నిశ్శబ్దాన్ని మించిన ఆకర్షణ ఏకాంతాన్ని మించిన తోడూ ఉండవేమో
9
66
795
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఒరిజినల్ దబంగ్ ని మించిన ఎంటర్టైనర్.. క్లాసిక్ కమర్షియల్.. దర్శకుడి హరీష్ శంకర్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే గబ్బర్ సింగ్..RTC Xroads సంధ్య లో పదిరోజుల తర్వాత కూడా సెకండ్ షో కు కూడా బ్లాక్ లో కొనాల్సొచ్చింది.. 2012 మే 11న విడుదలైంది
Tweet media one
Tweet media two
10
156
791
@ChennuriSita
ChennuriSitaRambabu
3 months
కదిరి వెంకటరెడ్డి అంటే తెలియకపోవచ్చు కానీ కె.వి.రెడ్డి అంటే గుర్తుపడతారు.. ఇవాళ దర్శకుడు కె.వి.రెడ్డి 113వ జయంతి.. పాతాళ భైరవి, మాయాబజార్ చాలు మనకు..
Tweet media one
8
101
791
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
దురదృష్టం వెంటాడిన నటుల్లో కాంతారావు ఒకరు.450కి పైగా చిత్రాల్లో నటించినా దాచుకున్నదేమీలేదు."కత్తి కాంతారావు" అన్న జనసామాన్యం మాట మిగిలింది.నారదుడిగా, లక్ష్మణుడిగా ఒదిగిపోయిన కాంతారావు రాకుమారుడిగా ఠీవిని ఒలకపోసేవారు. గొప్ప మెథడ్ యాక్టర్ అని పేరు సంపాదించారు. ఈరోజు వారి వర్ధంతి
Tweet media one
10
52
753
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కొవిడ్ తర్వాత మేం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం ఏడుగురం ఇలా మొదటిసారి కలుసుకున్నాం..
Tweet media one
37
16
751
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
మన పిల్లల చేత తెలుగు పుస్తకాలు చదివించలేకపోతే తెలుగు గురించి ఎన్ని ఉపన్యాసాలు దంచినా బూడిదలో పోసిన పన్నీరే!
6
94
754
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఇంటెన్స్ గా ఉంది వకీల్ సాబ్ లో.. తెలుగులో కోర్ట్ సీన్లు ఎమోషనల్ గా ఉండటం తక్కువ పింక్ తో పోలిక అనవసరం డైలాగ్స్ చాలా సెన్సిటివ్ గానూ సెన్సిబుల్ గానూ ఉన్నాయి ఆశయం..ఆలోచన..ఆవేదన..ఈమూడు పదాలను డైరక్టర్ చాలా అర్ధవంతంగా ఉపయోగించాడు.తమన్ నేపథ్య సంగీతం ఎస్సెట్
Tweet media one
16
129
696
@ChennuriSita
ChennuriSitaRambabu
18 days
"విజయవంతంగా 63 పూర్తి చేసి ఇవాళ 64లో ప్రవేశించటం జరుగుతోంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని జ్ఞాపకాలు.. చేదును మర్చిపోయి తీపి తో సాగిపోవటమే జీవితం అని తెలిసింది"
Tweet media one
207
22
693
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
దారి వంటరిదే తోడులేదని చింతించదు
Tweet media one
10
28
661
@ChennuriSita
ChennuriSitaRambabu
8 months
నిన్న ఆవిష్కరింపబడిన "ప్రజా యుద్ధ నౌక గద్దర్" శిలా విగ్రహం @mctellapur #Gaddar
Tweet media one
4
45
675
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
నిన్నా మొన్నటిదాకా బ్రహ్మానందం ఎలానో 75-89 సంవత్సరాల మధ్య హాస్య నటుడు నూతన్ ప్రసాద్ అంత బిజీగా ఉండేవాడు.అంతే నవ్వించేవాడు ఒక షూటింగ్ లో జరిగిన ప్రమాదం తన కెరీర్ పై విషాదపు తెర దించేసింది. అసలే దేశం క్లిష్టపరిస్తితుల్లో ఉంది అన్న ఆయన డైలాగ్ చాలా పాపులర్ ఆ రోజుల్లో ఇవాళ వారి జయంతి
Tweet media one
28
70
640
@ChennuriSita
ChennuriSitaRambabu
6 months
మేం ఏడుగురం ఇవాళ కలిశాం చాలా రోజుల తర్వాత ముగ్గురు అన్నదమ్ములం.. నలుగురు అక్క చెల్లెళ్ళు..
Tweet media one
56
26
645
@ChennuriSita
ChennuriSitaRambabu
6 months
తొలితరం దూరదర్శన్ న్యూస్ రీడర్ "శాంతి స్వరూప్ గారు" ఇక లేరన్న వార్త తెలిసింది ..భాష, శైలి ఉచ్చారణలో వారిదో ప్రత్యేక శైలి.. వారికి నివాళి 🙏🙏🙏
Tweet media one
114
121
629
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
తెలుగులో వచ్చిన ఏ కొత్త పుస్తకమయినా దొరికేచోటు "నవోదయ బుక్ హౌజ్" కాచిగూడా చౌరస్తా దగ్గర ఉంది. పుస్తకాలను ప్రేమించేవారు చూడాల్సిన బుక్ షాప్ వారి ఫోన్ నంబర్ :04024652387
Tweet media one
5
114
624
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఇవాళ మానాన్నగారి శతజయంతి 1923జనవరి 5న జన్మించారు.వారిపేరు చెన్నూరి దశరథరామారావు. తండ్రి ఆరోగ్యం కోసం ఆరోజుల్లో రైల్వే ఉద్యోగం మానేసి సొంతూరు చెన్నూరు లో ఉండి,కొన్ని సంవత్సరాల తరువాత పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేరారు.మా అమ్మ ప్రఫుల్లాదేవి ఆదర్శ గృహిణి.
Tweet media one
57
10
614
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
తెలుగులో తొలి స్టార్ కమెడియన్ కస్తూరి శివరావు..ఆయన జయంతి ఇవాళ..రేలంగి తెరంగ్రేటం చేసేవరకు ఒక వెలుగు వెలిగారు. మూకీచిత్రాల వ్యాఖ్యతగా జీవితం మొదలుపెట్టి ఖరీదైన కార్లలో తిరిగి చివరిరోజుల్లో పేదరికంతో సహజీవనం చేశారు. ఈ వ్యాసం మరింత వివరిస్తుంది..
Tweet media one
Tweet media two
15
92
605
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
రేడియో ప్రయోక్త, నటుడు,కథా,నాటక నవలా రచయితేకాకుండా, సంభాషణల రచయిత..ఇలా ఎన్ని ప్రక్రియలలో ఆరితేరారు గొల్లపూడి మారుతిరావు.ఒక్క "సాయంకాలమైంది" నవల చాలు. చివరి క్షణం వరకూ సాహిత్యంతో మమేకమయిన ధన్యజీవి..వారి "ఎలిజీలు" బాగా గుర్తుండిపోతాయి.వారి జయంతి ఇవాళ..
Tweet media one
14
75
602
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
బలగం సినిమా గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీలేదు.థియేటర్లో చూద్దామనుకుంటే అమెజాన్ లో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచింది.కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు ఎంత చిచ్చుపెడతాయో కథాంశం.తెలంగాణలో జానపదసంగీతం అనేక రూపాల్లో కనిపిస్తుంది.అందులో శారద తంబుర కథను చివరిలో వినియోగించారు.అది అబ్బురపరచింది
Tweet media one
10
29
598
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
నిన్న శ్రీశైలం వెళ్లినప్పుడు మా కార్ డ్రైవర్ ఫోన్ నబర్ సేవ్ చేసినప్పుడు council for citizen rights అని ట్రూ కాలర్ లో చూపించింది. అదేమిటని అడిగితే అది RTIs file చేసే ఎన్జీవో అని ఆరుగురు కలిసి రన్ చేస్తున్నామని చెప్పాడు. తమ గ్రామ పంచాయతీ లో నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పాడు.
4
46
564
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
నేను వెళ్ళే దారిలో వృద్ధులకు,దివ్యాంగులకు ప్రయాణం ఉచితం అంటున్న ఈఆటోవాలా ఎన్టీర్ అభిమాని.కాస్త అభినందిద్దాం
Tweet media one
10
112
532
@ChennuriSita
ChennuriSitaRambabu
2 months
చందమామ కథలు ఎన్నో రాసిన దాసరి సుబ్రహ్మణ్యం జయంతి ఇవాళ.. ఆయన గురించి ఆయన చందమామ నుంచి రిటైర్ అయ్యాక ఎక్కువ తెలిసింది
Tweet media one
5
68
545
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
తిరుమల గాలిలోనే పవిత్రత ఉంది మట్టిలోని అణువణువులోనూ భక్తి దాగి ఉంది ఆయన కరుణుంటే వెళ్ళగలుగుతాం లేదంటే లేదు ఇది నేను నేర్చుకున్నది కోనేటిరాయుడు కోరినవరాలిచ్చువాడు🙏
@ttd_seva
TTD Seva
3 years
Retweet if you are thankful for something God has blessed you with today!
Tweet media one
28
541
2K
7
64
530
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
ఇక చాలు బాబో అన్నంత 😊
Tweet media one
27
27
518
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
డబ్బును వెతుకుతున్న కొద్ది మనిషి తనను పారేసుకుంటాడు
3
30
514
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
అదేమిటో ఉదయం ఉత్సాహం సాయంత్రానికుండదు... రాత్రి దిగులు ఉదయానికుండదు... జీవనవైచిత్రి ఇలాగే ఉంటుందా? ప్రశ్న తొలిచేస్తోంది..
4
31
496
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
తెలుగువాడు కాకపోయినా ఎక్కువగా తెలుగు సినిమాలు తీసిన జానపదబ్రహ్మ ఆయన.. బందిపోటు(1963) తో మొదలుపెట్టి పల్లెటూరి చిన్నోడు(1973) వరకు పందొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు..ఆయనే విఠలాచార్య..గ్ర్రాఫిక్స్ తెలియని సినీంద్రజాలకుడు..ఇవాళ వారి జయంతి
Tweet media one
11
54
485
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
దీపావళి వచ్చిందంటే "వడ్డాది పాపయ్య" గారి ఇలాంటి కవర్ పేజీ 'యువ' మాసపత్రికకు ఉండాల్సిందే (వాట్సప్ సేకరణ)
Tweet media one
1
33
487
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
రెండూ కుటుంబ చిత్రాలే ఎందుకు "బలగం" తో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు ఎక్కడ"రంగమార్తాండ" విఫలమయ్యాడు మీ విశ్లేషణ ఏమిటి మీరేమంటారు?
Tweet media one
Tweet media two
124
23
488
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
అమృతం కురిపించే తన మాండలిన్ నాదాన్ని మనకిచ్చేసి తనుమాత్రం గంధర్వలోకానికి తరలివెళ్ళిపోయాడు. ఉప్పలపుశ్రీనివాస్అంటే గుర్తుపట్టలేం.మాండలిన్ శ్రీనివాస్ పేరుచెబితే వళ్ళుపులకరిస్తుంది.కర్ణాటక సంగీతంలో మాం��లిన్ వాయిద్యానికో ప్రత్యేకగుర్తింపుతెచ్చిన prodigy మాండలిన్ శ్రీనివాస్ జయంతిఈరోజు
Tweet media one
6
35
477
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
తెలుగు సినీ లోకంలో లౌక్యం తెలియని రాకుమారుడు "కాంతారావు" పలు కారణాలతో సంపాదించింది పోగొట్టుకుని సాదాసీదా జీవితం గడిపారు. 1923 నవంబరు 16న కోదాడ లో జన్మించారు. ఇది వారి శతజయంతి సంవత్సరం #Centenary
Tweet media one
14
65
458
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
ఎర్రబడ్డ ఆకాశం ఎగిరే పక్షులు చూడాలంటే నాలుగ్గోడలు వదిలి నాలుగడుగులు వేయాల్సిందే
Tweet media one
2
14
464
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
A WhatsApp forward🤗
Tweet media one
16
46
445
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
షష్ఠి పూర్తి సందర్భంగా అభినందనలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు 🙏🙏🙏
Tweet media one
26
4
435
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఈ రచయిత ఎవరో చెప్పగలరా? ఇవాళ వారి పుట్టిన రోజు
Tweet media one
32
14
435
@ChennuriSita
ChennuriSitaRambabu
1 month
WhatsApp forward కానీ చూడండి 👇
Tweet media one
5
66
438
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
కోట్ల సంవత్సరాల నుంచి అదే డిసిప్లిన్ ఉదయమైనా..సాయంత్రమయినా.. లైఫ్ లో ఇదొక్కటి నేర్చుకుంటే చాలేమో
Tweet media one
3
24
424
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
చిగురించే ఆశ చిరాయువు
Tweet media one
3
14
418
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
"బ్రో" సినిమా గురించి నెగిటివ్ గా ఎందుకు చెప్పారో కానీ,అంతే బోరేమీ అనిపించలేదు.త్రివిక్రం పంచ్ లు "మార్క్" మీద చాలా ఉన్నాయి.PK కి ఐడియల్ రోల్ .తనే లైఫ్ సినిమాకి.కేరక్టర్స్ మధ్య బాండింగ్ ఇంకొంచెం బావుండాల్సింది.తమన్ RR బావుంది. లైఫ్ సత్యాలు గురూజీ బానే గుర్తు చేశారు One time watch
Tweet media one
12
51
414
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
1975లో బ్లాక్ &వైట్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఫొటో 2022లో సీనియర్ సిటిజన్ గా ఇవాళ " అరవైరెండులో " ప్రవేశిస్తున్నవేళ.. వయసెంత గొప్పది.. జ్ఞాపకాలను దారంతా పరుస్తుంది...
Tweet media one
Tweet media two
90
6
414
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఎంత సుందర దృశ్యం
Tweet media one
6
18
401
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
అలా ముగిసింది షష్టిపూర్తి
Tweet media one
23
7
400
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
రాగిరేకులపై నిక్షిప్తమైన అన్నమయ్య కీర్తనలను తెలుగు ప్రజలకు అందించిన పండితులు "వేటూరి ప్రభాకరశాస్త్రి" గారి జయంతి ఫిబ్రవరి 7వ తేదీ. మనుచరిత్ర, శృంగారనైషధం,తంజావూరి రాజులచరిత్ర,బసవపురాణం వంటి గ్రంథాలను వ్యాఖ్యనసహితంగా మానవల్లి రామకృష్ణ కవితో కలిసి వెలువరించారు...
Tweet media one
5
72
405
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
"మా ముప్పైమూడేళ్ళ పెళ్ళి ప్రయాణం"
81
7
392
@ChennuriSita
ChennuriSitaRambabu
10 months
మళ్ళీ పాతికేళ్ళ తర్వాత నా మొదటి ఆకాశవాణి ఉద్యోగం డ్యూటీ ఆఫీసర్ సీటు లో కూర్చున్నాను విజయవాడ డెభ్భై ఐదేళ్ల పండుగ సందర్భంగా
Tweet media one
16
13
398
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
జీవితానికర్థముందని చెప్పింది గంగవ్వ అరవైఏళ్ళ వయసులో ఆకాశానికెగబాకిన పాపులారిటీతో యూట్యూబ్ స్టారయింది ఆనందాన్ని పంచుతోంది.. ఆదివారం ఉదయం పదిగంటలకు వివిధ భారతి హైదరాబాద్ 102.8FM లో గంగవ్వ ముచ్చట్లు వినండి @AirCbs
Tweet media one
2
18
395
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
తెలుగు భాషనూ సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళూ కొని దాచుకోవలసిన కలెక్షన్... అన్నట్టు శ్రీపాదవారి జయంతి ఏప్రిల్ 23న అప్పటిలోగా కొనాలని నిర్ణయించుకుంటారని ఆశించటంలో తప్పులేదనుకుంటాను🙏🙏
Tweet media one
3
29
389
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
చెట్టే ఐసొలేషన్ సెంటరయింది శివ అనే పద్ధెనిమిదేళ్ళ నల్గొండ జిల్లా యువకుడికి..కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో పదకొండురోజులు గడిపాడు ఆ చెట్టుమీదే అతని ధైర్యానికి, ఆలోచనకు అభినందించాల్సిందే ఫొటో కర్టెసీ the print
Tweet media one
Tweet media two
8
35
376
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఆకలి గెలిచింది బాల్యం ఓడింది
Tweet media one
8
57
378
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
"వెలుతురు లేని చీకటి దారిలో అయినా నడుస్తాను కానీ,కలలు లేని దారిలో నడవలేను" -గిరీష్ కర్నాడ్ Remembering Girish Karnad a great intellectual on his birth anniversary
Tweet media one
2
37
380
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
'ఉమా తెలుగు ట్రావెలర్' యూ ట్యూబ్ ఛానెల్ చూశారా! ఉమా మలెంపాటి గురించి చదివారా! జస్ట్ ఎనిమిదో తరగతి చదివి చిన్నా చితకా ఉద్యోగాలు చేసి ప్రపంచంలోని దేశాలన్నీ చూడాలన్న కోరికను తీర్చుకుంటున్న ఈ vlogger కథ ఆశను కల్పించే కథ.సంకల్పం ఉంటే ప్రకృతిలోని శక్తులన్నీ సహకరిస్తాయన్న విజయగాథ..
Tweet media one
10
46
381
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. మ���ం మన పిల్లలకు తెలుగు రాయటం చదవటం మర్చిపోవద్దని గుర్తుచేద్దాం. ఇంట్లో తెలుగు పేపర్ తెప్పించి చదవమని బతిమాలుదాం. తెలుగుని ఇంగ్లీషులో రాయొద్దని రిక్వెస్ట్ చేద్దాం. అమ్మ భాషని పట్టించుకోకపోవడం అమ్మని పట్టించుకోకపోవడమే అని గుర్తుచేద్దాం.
2
48
380
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
జీవితంలో మరో అంకానికి సిద్ధమవుతూ!
Tweet media one
39
8
373
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఇది ఏ స్టేషను లో ఉందో తెలుసా?
Tweet media one
179
4
378
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
మనకున్న హాస్య నటుల్లో ఎంతో ప్రతిభాశాలయిన సుత్తి వీరభద్రరావు జయంతి నేడు.జంధ్యాల&వీరభద్రరావులది తిరుగులేని జంట.శ్రీవారికిప్రేమలేఖ,వివాహభోజనంబు, బాబాయ్-అబ్బాయ్ వంటి అనేక చిత్రాల్లో నటించారు.డయిలాగ్ పలికే విధానంలోని ప్రత్యేకత వారిని అందరూ అభిమానించేలా చేసింది. వారి డయిలాగ్ గుర్తుందా?
Tweet media one
25
52
375
@ChennuriSita
ChennuriSitaRambabu
29 days
ఇవాళ భానుమతి గారి 99వ జయంతి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి పై వీడియో చేయాలంటే మీ inputs చెప్పండి
Tweet media one
23
26
371
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
'రక్తకన్నీరు' నాగభూషణంగా పేరుగాంచిన నటుడు నాగభూషణం శతజయంతి సంవత్సరమిది.విలన్,కామెడీ పుష్కలంగా పండించిన నటుడు. తనదైన ముద్రవేసిన నటుడు. "చరిత్ర అడక్కు..చెప్పింది విను" "ఎలా ఉందబ్బాయా" ఇలా స్పష్టమైన గొంతు నాగభూషణానిది.. ఎస్వీఆర్,నాగభూషణం,గుమ్మడి అరుదైన నటులు. వారి జయంతి ఇవాళ
Tweet media one
Tweet media two
2
29
361
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
ఉక్కిరిబిక్కిరి చేసేదే ఉద్యోగం చిక్కుముడులు తీసేదే కుటుంబం
2
13
360
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
వాట్సప్ సేకరణ
Tweet media one
16
78
364
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఇరవై మూడేళ్ల వయసులో రెండో నవల "మైరావణ"ను రాసిన చిచ్చరపిడుగు "ప్రసాద్ సూరాడ".voracious reader..జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రతి భావంతుడైన విద్యార్థి.. పేద కుటుంబంలో నుంచి వచ్చినవాడు.. అతని కాన్ఫిడెన్స్ మెచ్చుకోదగింది
Tweet media one
5
18
361
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
తనికెళ్ళ భరణి గారు ఇవాళ కలిసినప్పుడు
Tweet media one
11
9
363
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
తిరుపతి వెంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి జయంతి నేడు. వాదనా పటిమకు వారు ప్రసిద్ధి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారితో కలిసి అవధానాలు నిర్వహించారు. వారి 'పాండవోద్యోగ విజయాలు' నాటక పద్యాలు "బావా యెప్పుడు వచ్చితీవు?" "చెల్లియొ చెల్లకొ" వంటివి జనసామాన్యంలోకి చొచ్చుకు పోయాయి..
Tweet media one
1
31
353
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
"సిథ్ శ్రీరాం ఉచ్చారణ మారదు అతనంటే మన వాళ్ల భక్తి మారదు"
26
21
344
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
నటులు రాజనాల అసలు పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు.నెల్లూరు వాసి.లక్నో లో ఎమ్మే ఫిలాసఫీ చదువుకుని సినిమాల్లోకి వచ్చారు. మెథడ్ యాక్టింగ్ తెలిసిన వాడని చెబుతారు. జానపద చిత్రాల విలన్ గా సుప్రసిద్ధుడు.చివరి రోజులలో చాలా కష్టాలు పడ్డారు. ఇవాళ వారి 98 వ జయంతి #TeluguCinema
Tweet media one
16
28
345
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి. బతికుంటే 43వ పుట్టినరోజు చేసుకునేవాడు.. అతని పాటలు చూసినప్పుడల్లా చూసినప్పుడల్లా బాధేస్తుంది ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడూ అని. స్టార్ గా ఎదగాలనుకున్నాడు కానీ విషాదాన్ని మనకిచ్చి ఆకాశంలో తారగా మిగిలిపోయాడు
Tweet media one
14
33
340
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
గుండె నిండా రాముడు చేతిలో చిత్రకళ నోటిలో పైపు నవ్వే ఆభరణం ఆయనే "బాపు" తెలుగు సినిమాకు చూపు శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) 15.12.1933 - 31.08.2014
Tweet media one
4
31
339
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
నాస్తికులు సైతం ఆమె భక్తిలో ఆర్తిని మిళితం చేసి పాడే విధానానికి పరవశించి పోయేవారు. అది ఎమ్మెస్.సుబ్బలక్ష్మి గొప్పదనం. ఇవాళ వారి జయంతి. తన సంపదనంతా త్యాగం చేసిన ధీశాలి 🙏🙏🙏
Tweet media one
11
49
332
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
వంటరితనానికి ఏకాంతానికి తేడా ఏమిటి?
107
14
325
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కొన్ని దృశ్యాలకు భావాలు పేర్చటానికి పదాలు అక్కర్లేదు దృశ్యమే గుచ్చుకుంటుంది
Tweet media one
6
25
322
@ChennuriSita
ChennuriSitaRambabu
4 years
రథసప్తమి రోజున ఒక విషయం కొట్టేస్తోంది "సంతోషమూ...ఆనందమూ" ఒకటేనా అని.. కాస్త చెప్పండెవరయినా బాబులూ...
15
14
331
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
కోకోకోలా ఫార్ములా కన్నా పురాతనమైనది రుచిలో సాటిలేనిది ఆంధ్రుల ఆవకాయ! 😁😁😁
Tweet media one
12
11
327
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
#పుట్టినరోజు శుభాకాంక్షలు రామాయణ,భారత,భాగవతాది పురాణాలను ప్రవచనాల రూపంలో సరళంగా అందిస్తున్న చాగంటి కోటేశ్వరరావుగారి అరవైమూడవ పుట్టిన రోజు ఇవాళ. ఆశువుగా చెప్పే ప్రవచనం తెలుగు భాషలోని ఇందును,సొంపుని పరిచయం చేస్తుంది.
Tweet media one
8
37
325
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఇలాంటి ఇళ్ళు తెలంగాణ పల్లెల్లోనే కనిపిస్తాయి ఒకనాటి వారసత్వ వేదికలుగా... (ఫోటో కర్టెసీ:మిత్రుడు సుమనస్పతి)
Tweet media one
17
18
319
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ప్రయోగాలు చేసేవాళ్ళే ప్రయోజనాలు పొందుతారు. సందీప్ రెడ్డి అనే ఈపాడిరైతు లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ సమయంలో 500లీటర్ల మినీ పాలట్యాంక్ తయారుచేసుకున్నాడు ఉదయం ఆంధ్ర మహిళా సభ దగ్గర, సాయంత్రం తార్నాక దగ్గిర పాలని విక్రయిస్తుంటాడు భువనగిరి నుంచి వస్తుంటాడు మినీ ట్యాంకర్ ముచ్చటగా ఉంది
Tweet media one
8
64
322
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
2017లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వారికి ప్రకటించినప్పుడు వారిని రికార్డు చేశాం ఆకాశవాణికి..ఆ జ్ఞాపకం.. #KViswanath
Tweet media one
6
10
321
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి నేడు. వారి వేయిపడగలు చదవాలని ప్రయత్నించి విఫలుడనయ్యాను. మరోసారి ప్రయత్నించాలి
Tweet media one
18
36
322
@ChennuriSita
ChennuriSitaRambabu
11 months
తొమ్మిది వందల సినిమాలు అందులో 175చిత్రాల్లో హీరో పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతామాలక్ష్మి..ఇలా ఎన్నో.. విలక్షణ నటుడు చంద్రమోహన్ (1943-2023) కు నివాళి🙏🙏🙏
Tweet media one
19
35
323
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
#HBD Chandrasekhar Yeleti 2003లో వచ్చిన "ఐతే" చంద్రశేఖర్ ఏలేటి మొదటి చిత్రం.నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన "అనుకోకుండా ఒకరోజు" కూడా నంది పురస్కారం పొందింది. మోహన్ లాల్ నటించిన "మనమంతా" స్పెషల్ జ్యూరీ నంది పురస్కారం పొందింది. మరో మంచి చిత్రాన్ని తీస్తాడని ఎదురుచూస్తూ
Tweet media one
14
12
322
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
సర్దార్ ఉథంసింగ్ నిన్ననే చూశాను. ఇంత authentic biopic చూడలేదు. ముఖ్యంగా జలియన్ వాలా బాగ్ దమనకాండ చూసినప్పుడు వళ్ళు అట్టుడుకిపోతుంది. థియేటర్ లో రిలీజ్ అయితే ఇంకా బాగుండేది. దర్శకుడు షుజీత్ సర్కారు 1920,30ల నాటి లండన్, అమృతసర్ ప్రాంతాలను అద్భుతంగా చూపిస్తాడు.
Tweet media one
Tweet media two
7
30
312
@ChennuriSita
ChennuriSitaRambabu
3 years
ఆయన గొప్పదనానికి శిలావిగ్రహం కట్టినా. బతికున్నకాలంలో పేదరికంలో గడపటం మన దౌర్భాగ్యం. ఆయనే "మాతెలుగు తల్లికి మల్లెపూదండ"అని తెలుగుజాతి వెలుగులు పంచిన గీతరచయిత శంకరంబాడి సుందరాచారి..ఆత్మాభిమానం ఎక్కువున్న కవి వారి వర్ధంతి ఈరోజు.
Tweet media one
6
67
306
@ChennuriSita
ChennuriSitaRambabu
2 years
ఆస్కార్ వస్తే కానీ చూడనందుకు సిగ్గుపడుతూ The Elephant Whishperers డాక్యుమెంటరీ తమిళనాడు లోని ముదుమలై అరణ్యంలోని ఏనుగుల పునరావాస కేంద్రం గురించి,తమ జీవితాన్ని తప్పిపోయిన పిల్ల ఏనుగులను పెంచటానికి అంకితం చేసిన బొమ్మను,బెల్లీ దంపతుల స్వచ్ఛ ప్రేమను, అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది
Tweet media one
5
23
310
@ChennuriSita
ChennuriSitaRambabu
1 year
తమిళ సినిమా మనం ఊహించని ప్రయోగాలు చేస్తుంటుంది.అలాంటిది "మహావీరుడు" సినిమా. పిరికి కార్టూనిస్ట్ సత్య మహావీరుడు అనే రాజును శక్తిమంతంగా చూపిస్తుంటాడు.బస్తీలో ఉండే సత్య, ప్రభుత్వం కేటాయించిన అగ్గి పెట్టె లాంటి అపార్ట్మెంట్ లోకి బస్తీవాసులతో కలిసి మారతాడు.అక్కడ అనేక సమస్యలు.
Tweet media one
7
18
313
@ChennuriSita
ChennuriSitaRambabu
5 months
మహాకవి శ్రీశ్రీ కి నివాళి
Tweet media one
5
39
309